కాళేశ్వరంపై ఘోష్ కమిటీ నివేదికను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నాయకులు మంగళవారం ఆందోళన చేపట్టారు. రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జ్ రామ్ కిషన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాలేశ్వరంపైన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రాకు తరలించేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని అన్న