సాధారణంగా దొంగలు ఇండ్లల్లో చొరబడి నగదు. వెండి బంగారు ఆభరణాలు. ఇతర సామాగ్రి దొంగలు దొంగిలించడం తరుచూ వార్త పత్రికల్లో చూస్తుంటాం. అయితే ఆ దొంగతనాలకు భిన్నంగా ఓ రైతు మరో రైతు నుంచి యూరియా బస్తాలు దొంగతనం చేసిన సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలో చోటుచేసుకుంది. జైత్పర్ గ్రామ పంచాయతీ పరిధిలోని సాలేగూడ గ్రామానికి చెందిన చాపుడే బాలేష్ అనే రైతు వ్యవసాయ పొలంలోని షేడ్లో నిల్వ ఉంచగా. గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షెడ్ తాళం పగులగొట్టి లోపన ఉన్న 10 యూరియా బస్తాలను ఎత్తుకెళ్లారు. దిని పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయనున్నట్లు బాధిత రైతు తెలిపారు.