పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా మట్టి గణపతి ప్రతిమ విగ్రహాలను పూజిస్తామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అన్నారు. జగ్గంపేట వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను అందజేశారు. సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్సై రఘునాధరావు పాల్గొని ప్రజలకు వినాయక ప్రతిమలను అందజేశారు. మట్టివినాయకులను పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల ఆరోగ్యం హానికరమన్నారు.