నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని మెదక్ జిల్లాలో చార్మినార్ జోన్ లో కలపాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగ ఉపాధ్యాయ ధర్నా నిర్వహించారు.సెప్టెంబర్ 1న పెన్షన్ విగద్రోహ దినం పురస్కరించుకొని ఈ ధర్నా నిర్వహించారు.జేఏసీ చైర్మన్ దొంత నరేందర్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత హైదరాబాద్ లో జరిగే ధర్నాల్లో పాల్గోంటారు. ఈకార్యక్రమంలో అన్ని ఉద్యోగ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.