రైతులు నానో యూరియాను ఉపయోగించి అధిక దిగుబడి సాధించాలని కలకడ మండల ఎంపిడిఓ భాను ప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ యూరియాకు బదులుగా పంటలకు నానో యూరియా వాడకం వలన అధిక ప్రయోజనాలు ఉన్నాయని ఎంపీడీవో భాను ప్రసాద్ సూచించారు. మంగళవారం కలకడ మండలం దిగువ పాలెం లో రైతులకు సాధారణ యూరియా,నానో యూరియా మధ్య తేడాలను వివరించారు. నానో యూరియా నేడు ఆధునిక ఆవిష్కరణ అని అన్నారు.ధరతో పాటు పరిమాణం ద్రవ్యరాశిలో చిన్నదిగా ఉండటం వల్ల రైతులు తమ పొలాల వద్దకు సులభంగా తీసుకెళ్ళవచ్చన్నారు. రైతులు అనుమానాలు వీడి, నానో యూరియా వాడి అధిక దిగుబడులను సాధించాలన్నారు