తిరుపతి జిల్లా, వెంకటగిరిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీపొలేరమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమం లో దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, దేవాదాయ శాఖ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.