మంగళవారం సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ టోల్ ప్లాజా వద్ద పోలీసులు 600 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు వాహనాల తనిఖీ చేపట్టగా, తెలంగాణకు చెందిన బజాజ్ ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తుల వద్ద ఈ గంజాయిని గుర్తించారు. పట్టుబడిన వారిలో పవాద్, సయ్యద్ జహీర్, అద్నాన్ హుస్సేన్, మహమ్మద్ అప్సర్ ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.