రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో రేడియోలజీ డిపార్టుమెంటు లో పనిచేసే మధన్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఎక్సరే రూములోనే దుస్తులు లేకుండా పడుకొన్న ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారం మద్యాహ్నం ఆ స్థితిలో చూసిన కొందరు ఉన్నతాధికారులకు, సూపరింటెండెంట్ కు, ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు అక్కడికి చేరుకుని అతనిపై చర్యలకు ఉపక్రమించారు. ఇది ఆసుపత్రినా లేక లాడ్జింగా అంటూ పలువురు సామాజిక కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు మండిపడ్డారు. ఆ ఉద్యోగిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.