ములుగు జిల్లా కేంద్రంలో వానరాల (కోతుల) బెడద రోజు రోజుకు ఎక్కువవుతుంది. జనావాసాల్లోకి వచ్చి తీవ్ర ఇబ్బందులను గురిచేస్తున్నాయి. రైతుల పంటలను నాశనం చేస్తున్నాయని, రైతులు పొలాల్లో పనిచేయడానికి వెళ్ళాలంటే భయపడుతున్నారని, చిన్న పిల్లలు బయట ఆడుకునే పరిస్థితి లేదని, రోడ్లపై ప్రయాణించే వాహనదారులపై దాడులు చేసి గాయపరిచిన ఘటనలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఈ సమస్యను ఇక నిర్లక్ష్యం చేయకుండా, ప్రభుత్వం వెంటనే వన్యప్రాణి శాఖ, స్థానిక అధికారులను రంగంలోకి దించి కోతుల సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోతున్నారు.