రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలను గురువారం కుప్పంలో వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ఎమ్మెల్సీ భరత్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. పెద్దిరెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగు రీతిలో బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.