ఆదోని వైసీపీ కౌన్సిలర్ల మధ్య శనివారం వివాదం చోటుచేసుకుంది. మున్సిపల్ ఛైర్ పర్సన్ లోకేశ్వరి అధ్యక్షతన శనివారం కౌన్సిల్ సమావేశం జరిగింది. మున్సిపల్ దుకాణాల నెలవారి అద్దె నిర్ణయించిన ధరను ఆమోదించాలని అజెండాలో అంశాన్ని ఉంచారు. వేలం జరిగిన వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని కౌన్సిలర్ సందీప్డ్డి అభ్యంతరం తెలుపుతూ వాయిదా వేయాలన్నారు. వాయిదా వేయడం తగదని వైస్ ఛైర్మన్ అనడంతో కౌన్సిల్లో గందరగోళం నెలకొంది.