ములుగు జిల్లా కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద రైతులకు యూరియా బస్తాల కోసం అందిస్తున్న టోకెన్ల పంపిణీ నీ జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ నేడు గురువారం రోజున మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. యూరియా లేదని వస్తున్న పుకార్లను ఎవరు నమ్మవద్దని, రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని అన్నారు. రోజులవారీగా టోకెన్లు జారీ చేయడం జరుగుతుందని, దానిని గమనించి టోకెన్లు పొందిన రైతులు మాత్రమే యూరియా బస్తాల కోసం రావాలని సూచించారు.