తుగ్గలి మండలంలో జూపాడు బంగ్లాకు చెందిన నకిలీ పాస్టర్లు బుడగ జంగాల పుల్లయ్య, భాస్కర్, వీరేశ్లను ఎస్సీ కాలనీవాసులు గురువారం రాత్రి పోలీసులకు అప్పగించారు. అనాథాశ్రమం, వృద్ధాశ్రమం పేరుతో డబ్బులు వసూలు చేస్తూ, పాస్టర్ల ముసుగులో మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వారి వద్ద నుంచి సెల్ఫోన్లు, కారు, నకిలీ సంస్థల ఫొటోలు, బిల్ బుక్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.