వినాయక చవితి సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పోలీస్ అధికారులతో గురువారం సాయంత్రం 4గంటలకు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గణేష్ నిమజ్జనం శాంతియుతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా, ట్రాఫిక్ మళ్లింపు, రూట్ మ్యాపింగ్, మరియు విద్యుత్ జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని సూచించారు. నిమజ్జనం జరిగే మార్గాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టాలని, విగ్రహాలను కేటాయించిన రూట్లలో మాత్రమే తరలించాలని తెలిపారు.