శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణానికి చెందిన షాలిని అనే హిజ్రా పై నారాయణస్వామి అలాగే మరికొందరు శుక్రవారం అర్ధరాత్రి సమయంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన హిజ్రా కదిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా జిల్లా హిజ్రా కమిటీ వారు పరామర్శించి పోలీసులు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. నానా రకాల పదాలతో దుర్భాషలాడి అతడు దాడికి పాల్పడ్డాడని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.