కామారెడ్డి జిల్లా బీబీపెట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణి మహిళలకు రక్తహీనత నివారణ చర్యలపై అవగాహన కల్పించడం జరిగిందని మండల వైద్యాధికారిని డాక్టర్ శిరీష తెలిపారు. పీహెచ్సిలో అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీలకు వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారన్నారు. అనంతరం సాధారణ ప్రసవాల గురించి అవగాహన కల్పించామన్నారు.