గుంటూరు భారత్ పేటలో గత 30 సంవత్సరాలుగా నివసిస్తున్న తాను తన స్థలంలో అపార్ట్మెంట్ నిర్మాణం నిమిత్తం తనుకు బాగా పరిచయమైన హిందూ కళాశాలలో పనిచేస్తున్న కాలేషా వద్ద అపార్ట్మెంట్ పత్రాలు తాకట్టుపెట్టి 5 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకున్నట్లు రాజకుమార్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం నగరంలో ఆయన మాట్లాడారు డబ్బులు సర్దుబాటు అయిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చేందుకు వెళ్లగా తన వద్ద డబ్బులు తీసుకోవడం లేదని, అపార్ట్మెంట్ పత్రాలు ఇవ్వకుండా తిరిగి తనపైనే అక్రమ కేసు పెట్టినట్లు రాజకుమార్ తెలిపారు. ఈ కేసు విషయంలో అరండల్ పేట ఎస్సై నరసింహారావు తనను లక్ష రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని ఆరోపించారు.