జీవో 99 రద్దు చేయాలని,డోర్నకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ పిలుపు మేరకు మరిపెడలో నియోజకవర్గ ఇన్చార్జి గుమ్మడి ప్రభాకర్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిట్టిమల్ల మహేష్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం మాలల పట్ల వివక్ష చూపుతోందని, జీవో 99తో మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జీవో 99ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు