ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయి: ఎమ్మెల్యే సంజయ్ ఆదివారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ జీరో అవర్ లో మాట్లాడుతూ, పొద్దున నుంచి ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయని, ఇది బాధాకరమని తెలిపారు. ఎన్నికలప్పుడు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షలు చేస్తామని గొప్పలు చెప్పారని, కనీసం ఇప్పుడు బిల్లులు కూడా ఇవ్వట్లేదని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి తనకు పూర్తి మద్దతిస్తున్నారని, అయినా పనులు ఎందుకు జరగట్లేదో అర్థం కావట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.