నెల్లూరు VRC సెంటర్ వద్ద పోలీసుల మోహరింపు రైతాంగ సమస్యలు పరిష్కరించాలంటూ వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమం మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. VRC సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు VRC సెంటర్ వద్ద భారీగా మోహరించారు. దీంతో VRC సెంటర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరసన జరుగుతుందా లేదా అనే ఉత్కంఠ కొనసాగుతోంది.