ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు యుటిఎఫ్ ఆధ్వర్యంలో రణభేరి పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు వీరారెడ్డి మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగ ఉపాధ్యాయులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కానీ నూతన ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన విషయాలపై నూతన ప్రభుత్వం అండగా లేకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన ఏర్పడిందన్నారు. మూడు డిఏలు పెండింగులో ఉన్నాయి. పి ఆర్ సి గడువు పూర్తయి రెండు సంవత్సరాల అయినప్పటికీ చైర్మన్ ను నియమించలేదన్నారు.