సూర్యాపేట జిల్లా: యూరియా అంధక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆత్మకూర్ పిఎసిఎస్ ఎదుట తెల్లవారుజాము నుంచి బారులు తేలిన కూడా వారికి కావలసిన యూరియా లభించడం లేదని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డు పై ఒక రైతుకు ఒకటి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని వారు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని తెలిపారు. రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.