Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
డుంబ్రిగూడ మండలం లైగండ గ్రామంలో అరకులోయ సీఐ హిమగిరి సోమవారం మధ్యాహ్నం గిరి రైతులకు ప్రత్యమాయ పంటల మొక్కలను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా రైతులకు సిల్వర్, సీతాఫలం, నిమ్మ మొక్కలను సీఐ హిమగిరి, ఉద్యానవన శాఖ అధికారులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సిఐ హిమగిరి మాట్లాడుతూ గంజాయిరహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా అధికారుల బృందం నడు బిగించిందని ఇందులో భాగంగా పాడేరు ITDA సహకారంతో గిరి రైతులకు గంజాయి పంట బదులు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన మొక్కలను విత్తనాలను పంపిణీ చేస్తున్నామని దీన్ని ప్రతి రైతు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సీఐ హిమగిరి అన్నారు.