విద్యుత్ ఉద్యోగి కుటుంబానికి న్యాయం చేయాలని వినతి మెట్ పల్లి పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో శనివారం, విద్యుత్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తాత్కాలిక ఉద్యోగి సంబారి హరీష్ కుటుంబ సభ్యులు, ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ విద్యుత్ శాఖ డిఈకి వినతిపత్రం అందించారు. మూడు నెలల క్రితం పూర్ గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో హరీష్ గాయపడ్డాడని, తమ కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడి తల్లిదండ్రులు సాంబరి చంద్రశేఖర్, భులక్ష్మి దంపతులు, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తానని డిఈ హామీ ఇచ్చారు.