తాజా వరద వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద వినత పత్రాలతో నిరసన కార్యక్రమం తెలుపుతామని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు అన్నారు. మంగళవారం విజయవాడలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రౌండ్టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ముంపు నివారణ పై అశ్రద్ధ నేరపూరిత నిర్లక్ష్మన్నారు. విజయవాడ ఎన్టీఆర్ కృష్ణ జిల్లాలలో అభివృద్ధి బుడమేరు వరద ముంపు నివారణతో ముడిపడి ఉందని గుర్తు చేశారు అధికారులు స్పందించి వరద రాకుండా శాశ్వత పరిష్కారం కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని బాబురావు డిమాండ్ చేశారు.