కోడుమూరు మండలంలోని పులకుర్తి గ్రామంలో బుధవారం తెల్లవారుజామున తండ్రి రామాచారిని తల, ముఖంపై రోకలితో కొట్టి చంపిన కొడుకు వీర సాయిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య వీరుపాక్షమ్మ ఫిర్యాదు మేరకు సీఐ తబ్రేజ్ కేసు విచారణ చేసినట్లు తెలిపారు.