పెద్దవడుగూరు మండలంలో తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ సోమవారం పర్యటించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వినాయక చవితి వేడుకలపై నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ అనుమతులు తీసుకోవాలని కోరారు. ఘర్షణలకు వెళ్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.