వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలు భక్తులు రసాయనాలు కలిపి తయారుచేసిన వినాయకులని విగ్రహాలను ప్రతిష్టచకుండ స్వచ్ఛమైన మట్టితో తయారుచేసిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి నీటి కాలుష్యాన్ని పర్యావరణాన్ని ప్రకృతిని ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి పిలుపునిచ్చారు.బుధవారం జనగామ పట్టణంలో గో గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టితో తయారుచేసిన గణపతి ప్రతిమలను,కొబ్బరికాయ ఊది బత్తిలను ఉచితంగా పంపిణీ చేశారు.