ఆస్పరి మండలం బిల్లేకల్లు గ్రామ వ్యవసాయ మార్కెట్ను బోయ తిక్కయ్య వేలం పాటలో దక్కించుకున్నారు. గ్రామంలో ఊరి వాకిలిలో ఎంపీడీఓ గీతావాణి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన వేలం పాటలలో అత్యధికంగా రూ.89.40 లక్షలకు తిక్కయ్య దక్కించుకున్నారు. నిన్న ఆస్పరిలో మెహబూబ్ భాష రుక్కోటికి వ్యవసాయ మార్కెట్ను పట్టించుకున్నారు. వేలం పాట కార్యక్రమంలో పంచాయతీ అధికారులు ఆంజనేయులు, మాజీ ఎంపీపీలు వెంకటేష్, కృష్ణ యాదవ్,పెద్దయ్య, మహేష్, వీరేష్లు పాల్గొన్నారు.