వినాయక చవితి వేడుకల్లో భాగంగా కుషాయిగూడ పోలీస్స్టేషన్లో నాలుగో రోజు పూజా కార్యక్రమం వైభవంగా జరిగింది. రాచకొండ కమిషనరేట్ మల్కాజిగిరి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు పద్మజ స్వయంగా వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీబీ వెంకట్ రెడ్డి, కుషాయిగూడ ఎస్హెచ్ఓ భాస్కర్ రెడ్డి, కీసర ఎస్హెచ్ఓ ఆంజనేయులు, కుషాయిగూడ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.