కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసిన అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రజాకవి కాలోజి తన కవిత్వం ద్వారా సామాజిక సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చారన్నారు. ఆయన రచనలు ఉద్యమాలు ప్రజల్లో చైతన్యం నింపాయ అన్నారు. కాళోజి ఆలోచనలు నేటికీ సమాజాన్ని మార్గ నిర్దేశం చేస్తున్నాయన్నారు.