పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజక వర్గం నకరికల్లు మండలం చీమలమర్రి గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు నీరు బయటకు వెళ్లే మార్గానికి పలువురు అడ్డుకట్ట వేయడంతో చల్లగుండ్ల గ్రామ పరిసరాల్లోని సుమారు 40 ఎకరాల పొలాల్లోకి నీరు చేరిందని రైతులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళా రైతు నూర్జహాన్ బి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో మాట్లాడుతూ తన పొలంలో వేసిన వరి నారుమడులు నేటి మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలంటూ ఆమె కోరారు.