ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో నల్లమల్ల గిరిజన సంక్షేమ సంఘం జిల్లా చెవుల అంజయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన గిరిజనులకు డీఎస్సీలో అన్యాయం జరిగిందని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు కొండ ప్రాంతంలోని గిరిజనులకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక ప్యాకేజీ లో భాగంగా జీవో నెంబర్ 74 ఏర్పాటుచేసి గిరిజనుల అభివృద్ధికి తోడ్పాటున అందించినట్లు తెలిపారు. కానీ ఈనాడు గిరిజనులను జనరల్ కోటాలో కలపడంతో తీవ్రంగా నష్టపోయినట్లు పేర్కొన్నారు.