నెల్లూరు జిల్లా, రాపూరు మండలంలో ఈనెల 27వ తేదీ నుండి జరిగే గణేష్ ఉత్సవాలకు నిర్వాహకులు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సూచించారు. శనివారం నాడు ఎస్సై వెంకట రాజేష్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ సత్య నారాయణ మాట్లాడుతూ నిర్వాహకులు వారి ఫోన్ నెంబర్, విగ్రహం ఎత్తు, స్థలం, నిమజ్జనం చేసే తేదీలతో కూడిన వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. అనుమతి లేని మండపాల పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజె సౌండ్లు ఉండకూడదని , నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని అన్నారు. ప్రజలు నిమజ్జనం రోజు అప్రమత్తంగా ఉండాలని