చింతల మానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి మద్యానికి బానిసై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పురుగుల మందు తాగగా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఇస్లావత్ నరేష్ తెలిపారు,