జిల్లా కలెక్టరేట్ తరలింపుపై భీమవరం రాయలంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భీమవరంలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, కలెక్టరేట్ నిర్మాణానికి భూమి కూడా ఇస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కలెక్టరేటు ఉండికి తరలిస్తే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని శ్రీనివాస్ హెచ్చరించారు.