విశాఖపట్నంలో రాష్ట్ర టూరిజం, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను శనివారం ఆళ్ళగడ్డ జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఆళ్ళగడ్డ నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా తన సతీమణి మైలేరి సురేఖను నియమించినందుకు గాను మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఆళ్లగడ్డలో త్వరలో జరగనున్న AMC చైర్మన్ ప్రమాణ స్వీకారానికి రావాలని మంత్రి దుర్గేష్ ను మైలేరి మల్లయ్య ఆహ్వానం పలికారు.