యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించిన గిరి ప్రదక్షణకు భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామునంచే భక్తులు పర్వతం చుట్టూ ఉన్న గిరి ప్రదక్షణకు మార్గంలో నడుస్తూ తమ భక్తి భావాన్ని చాటుకున్నారు .శుక్రవారం ప్రతిక్షణానంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కలు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకున్న ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.