Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: డా.ఎన్టీఆర్ వైద్య సేవలో రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవు: కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

India | Sep 9, 2025
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బు తీసుకోవడం సముచితం కాదని కలెక్టర్ తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us