నరసన్నపేట: ఉపాధి వేతనదారులు సమయ వేళలు పాటించండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా ఉపాధి వేతనదారులు తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని ప్రాజెక్టు డైరెక్టర్ జి చిట్టిరాజు తెలిపారు. ఆదివారం ఉదయం నరసన్నపేట మండలం కోమర్తి, మాకివలస, పోతయ్య వలస పంచాయతీలలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఉదయం 6: 30గంటల నుంచి 10 గంటల వరకు పనిచేయాలని అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు పనులు కొనసాగించాలని ఆయన ఆదేశించారు.