సోమవారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బిజెపి కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టాగా ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యురాలు డి కె అరుణ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ..బిఆర్ ఎస్ పార్టీలో గెలిచి ఇప్పుడు ఎ పార్టీలో ఉన్నాడో తెలియని ఎమ్మెల్యే తో గద్వాల జిల్లా అభివృద్ధి కుంటు పడిపోయిందన్నారు.గత బిఆర్ ఎస్ పార్టీలో ఉన్నప్పడు ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ లోకి అభివృద్ధి పేరున పార్టీ మారిన ఎమ్మెల్యే నేటికీ జోగులాంబ గద్వాల జిల్లా మాత్రం అభివృద్ధిలో గుండు సున్న అంటూ కితబు ఇచ్చారు.