బొండపల్లి మండలం కనిమేరక గ్రామ సచివాలయంలో యూరియా పై సుమారు మధ్యాహ్నం రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో ఎంపీడీవో గిరి బాల , మండల వ్యవసాయ అధికారి మల్లికార్జునరావు పాల్గొని పలు విషయాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత పంటకాలానికి సంబంధించి రైతులకు కావలసిన యూరియా పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. అలాగే నెలివాడ అంబటి వలస బండపల్లి జె గుమ్మడం వెదురువాడ మరువాడ లలో ఏఈఓ సంతోష్ తదితరుల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించారు.