లక్ష్మణ్ చందా మండలం మునిపెల్లి గ్రామం వద్ద గోదావరినది అవతలి వైఫు చిక్కుకున్న తమ 200ల గేదెలను కాపాడాలంటూ రైతు వేడుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం గోదావరి అవతలి వైపుకు మేత కోసం తమ గేదెలను తీసుకెళ్లమని, భారీ వర్షం కారణంగా గోదావరి నది ఉధృతంగా ప్రవహించడంతో తమ గేదెలు అవతలి వైపే చిక్కుకున్నయని వాపోయారు.ఈ విషయం తెలుసుకున్న జిల్లా అధికారులకు గేదెల కాపరిని కాపాడరని కానీ తమ గేదేలు మాత్రము అక్కడే ఉన్నాయన్నారు. అయితే ప్రాజెక్టు అధికారులు నీటి ప్రవాహాన్ని కొంచెం తగ్గిస్తే తమ గేదెలు ఎలాగైనా ఒడ్డుకు తెచ్చుకుంటామన్నారు.