గద్వాల బస్టాండ్లో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు బుధవారం మధ్యాహ్నం వినూత్నంగా నిరసన తెలిపారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భిక్షాటన చేశారు. విద్యాశాఖకు మంత్రి లేకపోవడంపై మండిపడ్డారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.