చర్లపల్లిలోని వాగ్దేవి కంపెనీలో మహారాష్ట్ర పోలీసులు డ్రగ్స్ దందాపై దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగ్లాదేశ్ శివతి ఫాతిమా మురద్ అరెస్టుతో ఈ డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు 5.968 కిలోల మెపిడిన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాదుకు చెందిన శ్రీనివాస్, విజయ్ లతో ఫాతిమాకు డ్రగ్స్ సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ తయారీకి ఉపయోగించే కోట్లాది రూపాయల ముడి సరుకును కూడా పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసులో మొత్తం ఇద్దరిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీసులు తెలిపారు.