ప్రజలకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా సల్లగా గణనాధుడు చూడాలని భక్తులు కోరారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీ సెంటర్ లో అత్యంత భక్తిశ్రద్ధలతో,భారీ సెట్టింగ్ లతో గణనాథుడు కొలువయ్యాడు. నవరాత్రి పూజలు, ఉత్సవాలు జరుపుకొని తన మాతృమూర్తి గంగమ్మ ఒడిలో నిమజ్జనం జరుపుకోవడానికి శోభాయాత్ర జరిగింది.శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవములు జరిపిన వైరా ఎమ్మెల్యే అభినందించారు. వారు మాట్లాడుతూ గ్రామాలలో నగరాలలో పల్లెలలో ప్రశాంతమైనవాతావరణంలో ఉత్సవాలు జరిగితే సంతోషంగా ఉంటుందని, తెలిసి తెలియక కొంతమంది అల్లరి చేస్తేనే ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు.