నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలలో శుక్రవారం జరిగే వినాయక నిమజ్జనోత్సవాల్లో ట్రాక్టర్ డ్రైవర్లు మద్యం తాగి పాల్గొనరాదని కొలిమిగుండ్ల సీఐ రమేష్ బాబు హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ డీజే సౌండ్ బాక్స్లకు అనుమతి లేదని, భక్తి భావంతో నిమజ్జనోత్సవాల్లో పాల్గొనాలని ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. చిన్నపిల్లలను నిమజ్జనం ఉత్సవాలకు దూరంగా ఉంచాలని ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు