అనపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అనపర్తి లో బిక్కవోలు అనపర్తి మండలాల వాలంటీర్లతో సమావేశమయ్యారు. మహేంద్రవాడలో 23 మంది లబ్ధిదారులకు ఇల్ల పట్టాలను పంపిణీ చేశారు. వేండ్ర గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, కాపు కళావేదికను ప్రారంభించారు. అదేవిధంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వంగవీటి మోహన్ రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు.