చిత్తూరు: ఐదుగురు జేఎల్ఎం లపై సస్పెన్షన్ వేటు విధులలో ఉండాల్సిన సమయంలో ఎలాంటి అనుమతి లను తీసుకోకుండా చిత్తూరు కలెక్టరేట్లో గ్రీవెన్స్ డే హాజరైన ఐదుగురు జూనియర్ లైన్మెన్లను ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ సస్పెండ్ చేశారు. దొరబాబు, రామకృష్ణ, మల్లికార్జున, ప్రేమ కుమార్, యశ్వంత్ ను సస్పెండ్ చేశారు. ప్రమోషన్ కోర్సులు పొందేందుకు రాత్రి కాలేజీలలో చదువుకునేలా అనుమతి ఇవ్వాలని కోరేందుకు వెళ్లిన వీరిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.