సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలోని జూకల్ లో ఉన్న పెద్ద శంకరంపేట బీసీ బాలుర గురుకులం పై విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి కలత చెందవద్దని గురుకులం ప్రిన్సిపాల్ వింధ్యావత్ శ్రీను తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ గురుకుల పాఠశాల పై వస్తున్న దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మవద్దని తెలిపారు. గురుకుల పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి, సబ్ కలెక్టర్ ఉమా హారతి, గురుకులాల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హాస్టల్లో విద్యార్థులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. గురుకులంలో 40 కి పైగా మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయని తెలిపారు.